Sone Moriya Song Lyrics in Telugu - Raju Gari Gadhi
Sone Moriya Song Lyrics in Telugu - Raju Gari Gadhi
| Singer | N/A | 
| Composer | Sai Kartheek | 
| Music | Sai Kartheek | 
| Song Writer | handra Bose | 
Sone Moriya Song Lyrics in Telugu - Raju Gari Gadhi
___________________________________________________________________________________
సోనె మోరియా సోనె మోరియా…
తానానే నన్నాన .......                           (2X)
ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య
అమ్మంటి ఆలన లాలన అన్నయ్య
నాకంటే ముందుగా పుట్టిన నా ఇంకో
రూపం తానుగా నా నీడకే ప్రాణాలుగా
నిలిచింది తానేగా…
ఓ  ఓహో ఓ…                                       (2X)
సోనె మోరియా సోనె మోరియా… 
తానానే నన్నాన                                    (2X)
కలిసే నిదరోతుంటాము......
కలిసే కలగంటుంటాము
కలిసే కలబడతాము
 విడిపోతాము ముడిపడతాము
ఒక పువ్వుకి రంగులు మేము
ఒక పక్షికి రెక్కలు మేము
ఒక జన్మే కాదంటూ
పది జన్మలకు ఒకటవుతాము
నా ఆకలి చూసి అమ్మయ్యాడు అన్నయ్యే
నా ఆశలు తీర్చే నాన్నయ్యాడు తానే
అన్నయ్యకు అర్ధం చెప్పనా…
 అది పిలుపే కాదని తెలుపనా
ఆటాడక నే పొందిన గెలుపేగా అన్నయ్య… 
ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య        (2X)
___________________________________________________________________________________