Anthahpuramlo Telugu Song Lyrics - Rudhramadevi | Anushka, Allu Arjun, Nitya Menon Lyrics - K.S Chitra , Sadhana Sargam, Chinmayi, Chorus
Anthahpuramlo Telugu Song Lyrics - Rudhramadevi
| Singer | K.S Chitra , Sadhana Sargam, Chinmayi, Chorus |
| Composer | Ilayaraja |
| Music | Ilayaraja |
| Song Writer | Seetharama Sasthri |
Anthahpuramlo Telugu Song Lyrics - Rudhramadevi
అంతఃపురం లో అందాల చిలకా...
సందేహమేలనే అంతగా...
అంబరమేలగా అడ్డు ఎవరు నీకిక
చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా...
రివ్వంటు రావే స్వేచ్చగా...
అద్దాల మేడలో పొద్దు గడపకే ఇక
అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక
వెల్లువై పొంగుతున్నదే వేల పూల వాటిక
ఇల్లారా అన్నదే విరుల వీచిక
అంతఃపురం లో అందాల చిలకా...
అంతఃపురం లో అందాల చిలకా...
రేయి వెనకాల
రాని కునుకేల
వెలికి రా శశికళా...
జలతారు ముసుగేల
చిలిపి జలకాల
మునిగి పోదాం హలా
పరదాలు పహరాలు దాటి పోవాలి ఆగిపోకలా...
వాయువేగాన సాగి పోవాలి అన్నివైపులా...
పెట్టేదెవరట కలలకు కాపలా...
పట్టే్దెవరట ఉరికిన ఊహలా...
కట్టేదెవరు మనసు సయ్యాటలా...
అంతఃపురం లో అందాల చిలకా...
అంతఃపురం లో అందాల చిలకా...
గాలి గిలిగింత పూల పులకింత
తనువు అణువణువునా
సిరికొత్త కవ్వింత కొంటె కేరింత
మదికి విన్నవించెనా
నీలాల నయనాల వెల్లి విరిసేను మెరుపు మిలమిలా...
అహ .. పాల కెరటాల ఊయలూగెను ఊపిరే ఇలా
ఏదో మధురిమ మనకది తెలిసెనా...
ఏదో సరిగమ మననటు పిలిచెనా...
ఏవో సుధలు చిలుకు ఆలాపన
అంతఃపురం లో అందాల చిలకా...
సందేహమేలనే అంతగా
అంబరమేలగా అడ్డు ఎవరు నీకిక
చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా...
రివ్వంటు రావే స్వేచ్చగా...
అద్దాల మేడలో పొద్దు గడపకే ఇక
అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక
వెల్లువై పొంగుతున్నదే వేల పూల వాటిక
ఇల్లారా అన్నదే విరుల వీచిక
అంతఃపురం లో అందాల చిలకా...
అంతఃపురం లో అందాల చిలకా...