Type Here to Get Search Results !

Oh Sita Hey Rama Telugu Song lyrics - Sita Ramam

 

Oh Sita Hey Rama Telugu Song lyrics - సీతా రామం | Dulquer | Vishal | Hanu Raghavapudi - SPB Charan and Ramya Behara Lyrics


Oh Sita Hey Rama Telugu Song lyrics - Sita Ramam | Dulquer | Vishal | Hanu Raghavapudi

Movie          :       సీతా రామం

Singer              : SPB Charan and Ramya Behara
Composer        : Vishal Chandrashekhar
Music              :       Vishal Chandrashekhar
Song Writer     :Ananth Sriram

Do Want to See Lyrics 👇



Lyrics

ఓ సీతా వదలనిక తోడవుతా....😍😍😍

రోజంతా వెలుగులిడు నీడవుతా....😍😍😍

దారి నడిపేనే చేతి గీత

చేయి విడువక సాగుతా....

తీరం తెలిపెనే నుదుటి రాత

నుదుట తిలకమై వాలుతా....

కనులలో మెరుపులా తారాడే

కలని నేనవుతా...

హై రామ ఒకరికొకరవుతామా

కాలంతో కలిసి అడుగేస్తామా

రేపెం జరుగునో రాయగలమా

రాసే కలములో మారుమా

జంటై జన్మని గీయగలమా

గీసే కుంచెనే చూపుమా

మెరుపులా ఉరుములా

దాగుండే నిజము చూడమ్మా

ఓ సీతా వదలనిక తోడవుతా

హై రామ ఒకరికొకరవుతామా....


నేరుగా పైకి తెలుపని

పలుకులన్నీ నీ చూపులై

నేలపై వాలుతున్నవి

అడుగు అడుగున పువ్వులై

ఓ వైపేమో ఓపలేని మైకం

లాగుతోంది మరో వైపు లోకం

ఏమి తోచని సమయమా

ఏది తేల్చని హృదయమా

ఏమో బిడియము నియమము నన్నాపే

గొలుసు పేరేమో


నిదురలేపడు ఒక్క నీ పేరే

కలవరిస్తానులే

నిండు నూరేళ్లు కొలువని తెలిసి

జాగు చేస్తావులే

ఎపుడు లేదే ఎదో వింత బాధే

వంతపాడే క్షణం ఎదో లాగే

కలిసొస్తావా ఓ కాలమా

కలలు కునుకులా కలుపమా

కొలిచే మనిషికి ఓ కొలువుండేలా


మాయ చూపమ్మ

హై రామ ఒకరికొకరవుతామా....

కాలంతో కలిసి అడుగేస్తామా


దారి నడిపేనే చేతి గీత

చేయి విడువక సాగుతా...


తీరం తెలిపెనే నుదుటి రాత

నుదుట తిలకమై వాలుతా


కనులలో మెరుపులా తారాడే

కలని నేనవుతా....

Please do follow my blog for more telugu and other languages of lyrics 


Oh Sita Hey Rama Telugu Song lyrics - Sita Ramam | Dulquer | Vishal | Hanu Raghavapudi Watch Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Below Post Ad